అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు గరివిడి లక్ష్మి చిత్రం

రిపోర్టర్: నరేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా గౌరి నాయుడు జమ్ము దర్శకత్వంలో వస్తున్న చిత్రం గరివిడి లక్ష్మి అని మేకర్స్ తెలిపారు. ఆనంది టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి కొండ కోన పాటను విడుదల చేశామని, అక్టోబర్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని వారు పేర్కొన్నారు.