నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
రిపోర్టర్: Durgam Syam
స్థలం: సీతారామపురం
నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అదనపు బలగాలను మోహరించనున్నట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తామని వెల్లడించారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటిస్తూ పోలీసు యంత్రాంగానికి ప్రజలు అందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.