హైదరాబాద్‌లో దారుణం: మహిళపై భర్త సహా నలుగురితో సామూహిక లైంగిక దాడి
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన సామూహిక లైంగిక దాడి ఉదంతం వెలుగు చూసిందని పోలీసులు తెలిపారు. మయన్మార్‌కు చెందిన ఓ మహిళపై ఆమె భర్త ఫయజ్ తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. మద్యానికి బానిసైన భర్త తన స్నేహితులతో సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి తెచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు.