తన కెరీర్ లో అత్యంత కఠినమైన బ్యాటర్ చతేశ్వర్ పుజారా అంటూ ప్యాట్ కమిన్స్ వెల్లడి

రిపోర్టర్: రమేష్ స్థలం: ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన కెరీర్ లో తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్ గా భారత దిగ్గజం చతేశ్వర్ పుజారాను ఎంపిక చేశారు. పుజారా క్రీజులో చూపించే పట్టుదల, సహనం ప్రత్యర్థి బౌలర్లకు నిజమైన నరకం చూపిస్తాయని, అతడిని ఔట్ చేయడం వెయ్యి పేపర్ కట్లతో చంపేసినట్లు ఉంటుందని ప్రైమ్ వీడియో స్పోర్ట్ కార్యక్రమంలో కమిన్స్ ప్రశంసించారు.