విజయవాడలో సచివాలయ ఉద్యోగుల చలో ధర్నా ఉద్రిక్తత మరియు అరెస్టులు

రిపోర్టర్: రమేష్ స్థలం: విజయవాడ

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు అనుమతులు నిరాకరించడంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు భారీగా తరలివచ్చి ఆందోళనకు దిగారు. దాదాపు పదకొండు గంటలపాటు సాగిన ఈ నిరసనలో ఏడు వందల మందిని పోలీసులు అరెస్టు చేసి వేర్వేరు స్టేషన్లకు తరలించినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.