సోషల్ మీడియాలో కలకలం: సౌత్ సినిమా షూటింగ్ విధానాలపై జాన్వీ కపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

సౌత్ సినీ పరిశ్రమలో సినిమా తెరకెక్కించే విధానంపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న ఆమె, సౌత్ సినిమాల్లో ముందుగానే పూర్తి స్క్రిప్ట్ ఉండదని, కెమెరా యాంగిల్స్ గురించి ముందస్తు సమాచారం లభించదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తెలుగు ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, అన్ని ఇండస్ట్రీలను ఒకే గాటన కట్టడం తగదని నెటిజన్లు మండిపడుతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.