పైరసీ కింగ్ ఐబొమ్మ రవికి ఆర్థిక కష్టాలు: కోర్టులో పిటిషన్

రిపోర్టర్: రమేష్ స్థలం: Hyderabad

ఒకప్పుడు విదేశాల్లో విలాసవంతంగా బతికిన ఐబొమ్మ రవి ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయాడు. పైరసీ కేసులో అరెస్ట్ తర్వాత స్తంభింపజేసిన తన బ్యాంక్ ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేయాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. కుటుంబ పోషణ, వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్నానని రవి కోర్టుకు విన్నవించాడు. ఈ పిటిషన్‌పై పోలీసులు వివరణ కోరే అవకాశం ఉంది. గతంలో పోలీసులకు సవాల్ విసిరిన రవి, జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు.