విశాఖలో కలకలం రేపిన చిరిగిన కరెన్సీ నోట్లు

రిపోర్టర్: రాము స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం సెంట్రల్ పార్క్ వద్ద చెట్టు కింద భారీగా చిరిగిన కరెన్సీ నోట్లు కుప్పలుగా పడి ఉండటం కలకలం రేపింది. రూ.500, రూ.100, రూ.50 నోట్లతో పాటు ఓ మహిళకు సంబంధించిన పాన్ కార్డు, ఎల్ఐసీ రసీదులు లభించాయి. మార్నింగ్ వాకర్స్ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నోట్లను స్వాధీనం చేసుకుని, సీసీటీవీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.