విశాఖలో వాయిస్ ఆధారిత ఈ-ఫిర్యాదు కియోస్క్లను ప్రారంభించిన హోంమంత్రి

రిపోర్టర్: శివ స్థలం: విశాఖపట్నం

ప్రజా ఫిర్యాదుల స్వీకరణను మరింత సులభతరం చేసే లక్ష్యంతో విశాఖ నగరంలో వాయిస్ ఆధారిత ఈ-ఫిర్యాదు కియోస్క్లను ప్రారంభించినట్లు VizagCityPolice వెల్లడించారు. రైల్వే స్టేషన్ మరియు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద హోంమంత్రి వంగలపూడి అనిత వీటిని ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి చొరవతో ఏర్పాటు చేసిన ఈ సదుపాయం ద్వారా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాట్లాడి నేరుగా ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు. వృద్ధులు, అక్షరాస్యత తక్కువగా ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.