పసిపిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న పోషకాహారం
రిపోర్టర్: AHMED
స్థలం: పొదలకూరు
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి అంగన్వాడీ కేంద్రంలో తొమ్మిదో జాతీయ పోషణ మాసోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. సీడీపీవో విజయలక్ష్మి ఆదేశాల మేరకు సూపర్వైజర్ ఆదినారాయణమ్మ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలకు అందించే పోషకాహారంపై అవగాహన సదస్సును చేపట్టారు. మూడేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లలకు రోజూ ప్రోటీన్లు, విటమిన్లు కలిగిన వేడి భోజనంతో పాటు పాలు, ఉడికించిన గుడ్డు అందిస్తున్నట్లు తల్లులకు వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ నరసమ్మ, ఏఎన్ఎం అరుణ, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, తల్లులు విశేషంగా పాల్గొన్నారు.