కరీంనగర్ లో గంజాయి గుట్టురట్టు: ఇద్దరు నిందితుల అరెస్ట్, రిమాండ్ కు తరలింపు
రిపోర్టర్: సతీష్
స్థలం: కరీంనగర్
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పరిధిలో గంజాయి అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు కొత్తపల్లి ఎస్హెచ్ఓ బిల్లా కోటేశ్వర్ తెలిపారు. మహారాష్ట్ర నుంచి గంజాయిని కొనుగోలు చేసి చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్న మహమ్మద్ మున్నా, మహమ్మద్ షారుక్లను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి రెండు కిలోల పైచిలుకు గంజాయితో పాటు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు ఆయన వెల్లడించారు.