ఎస్సీ ఎస్టీల రక్షణ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత సీఎం రేవంత్
రిపోర్టర్: రమేష్
స్థలం: Hyderabad
సచివాలయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలుపై రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి నిఘా పర్యవేక్షణ కమిటీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. దళితులు, ఆదివాసులు, గిరిజనుల అభివృద్ధి, రక్షణ తమ ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయింపులతో పాటు ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.