ఆఫ్రికాలో సోలార్ విద్యతో వెలుగులు నింపుతున్న ప్రముఖ సింగర్ అకాన్

రిపోర్టర్: సతీష్ స్థలం: Senegal

ఆఫ్రికాలోని మారుమూల ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం అందించే లక్ష్యంతో సింగర్ అకాన్ ప్రారంభించిన సోలార్ ప్రాజెక్ట్ సంచలనం సృష్టిస్తోందని నిర్వాహకులు తెలిపారు. సెనెగల్ దేశానికి చెందిన ప్రముఖ గాయకుడు అకాన్ తో పాటు థియోన్ నియాంగ్, సాంబ బాథిల్లీలు సంయుక్తంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. విద్యుత్ లేని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు, ఆర్థిక కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు సోలార్ కిట్లు, వీధి దీపాలను ఏర్పాటు చేస్తూ లక్షలాది మంది ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్నట్లు వెల్లడించారు.