యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
కేవలం పదిహేనేళ్ల వాయస్సులోనే వైభవ్ సూర్యవంశీకి బాధ్యతలు అప్పగించడం చాలా తొందరపాటు చర్య అవుతుందని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. రెడ్ బాల్ క్రికెట్ లో మరింత అనుభవం సంపాదించే వరకు అతడిని ఒక్కో మెట్టు ఎక్కనివ్వాలని ఆయన పేర్కొన్నారు. తాజాగా నిర్వహించిన రెడ్డిట్ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సచిన్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సూర్యవంశీ ప్రతిభను అభినందిస్తూనే భారం పెంచవద్దని సూచించారు.