డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు: పేర్ని నాని సంచలన ఆరోపణలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: కర్నూలు
ఏపీ డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. యువగళం పాదయాత్రలో పాల్గొన్న వారికి, అర్హత లేని వారికి టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. కర్నూలు జిల్లాలో స్పోర్ట్స్ కోటా పేరుతో 24 మందికి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు ఇచ్చారని, దీనిపై తక్షణమే విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.