ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలిగా సుస్మిత కొణిదెల.
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలిగా మెగాస్టార్ చిరంజీవి కూతురు, సినీ నిర్మాత సుస్మిత కొణిదెల నియమితులయ్యారు. దేవాదాయ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో ఆమె తన సేవలను అందించనున్నారు.