అట్టహాసంగా సూర్య-జ్యోతిక వివాహ వార్షికోత్సవం, కంటతడి పెట్టిన హీరో!

రిపోర్టర్: మహేష్ స్థలం: India

కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య మరియు జ్యోతిక తమ వివాహ జీవితం విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకలో వారి పిల్లలు దియా, దేవ్ కూడా పాల్గొన్నారు. జ్యోతికను చూసి సూర్య భావోద్వేగానికి గురై కంటతడి పెట్టడం, సోషల్ మీడియాలో ఈ అరుదైన దృశ్యాలు వైరల్ కావడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.