తుపాను బీభత్సం: తొంబై మూడు ఆసుపత్రులకు ఇరవై కోట్ల నష్టం

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమరావతి

అర్నబ్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని తొంబై మూడు ఆసుపత్రులు, వైద్య సంస్థల్ లో మౌలిక సదుపాయాలకు ఇరవై కోట్ల యాభై మూడు లక్షల రూపాయల మేర నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అత్యధికంగా కాకినాడ జీజీహెచ్ లో ఏడు కోట్ల తొమ్మిది లక్షలు, విశాఖ కేజీహెచ్ లో కోటీ తొంభై లక్షల రూపాయల చొప్పున నష్టం వాటిల్లినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.