వైఎస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబుతో పాటు ఇతరులపై పోలీసుల కేసులు
రిపోర్టర్: సునీల్
స్థలం: Vijayawada
విజయవాడలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయం ముట్టడికి యత్నించిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాజా టోల్ ప్లాజా వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబును అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనలో అంబటి రాంబాబుతో పాటు మరో 15 మందిపై మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, వివిధ స్టేషన్లలో మొత్తం 250 మంది వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.