గునుపూడిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ అధికారులు
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నాథవరం
నాతవరం మండలంలోని గునుపూడి రైతు సేవా కేంద్ర పరిధి ఎస్బీ పట్నంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి జి.సుగుణ మాట్లాడుతూ వరి పంట సాగు చేసిన రైతులు ఈ-క్రాప్ నమోదు, ఈ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని సూచించారు. సమగ్ర ఎరువుల యాజమాన్యం, పురుగుల నివారణపై రైతులకు అవగాహన కల్పించి, ప్రకృతి వ్యవసాయ పొలాలను పరిశీలించారు.