విశాఖపట్నం నివాసి బుద్ధా చంద్రశేఖర్‌కు అంతర్జాతీయ విజనరీ లీడర్ అవార్డు

రిపోర్టర్: సురేష్ స్థలం: విశాఖపట్నం

అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసీటీఈ చీఫ్‌ కోఆర్డినేటింగ్‌ అధికారిగా పని చేస్తున్న విశాఖపట్నానికి చెందిన బుద్ధా చంద్రశేఖర్‌కు అంతర్జాతీయ పురస్కారం లభించింది. అమెరికాకు చెందిన నాలెడ్జ్‌ నెట్‌వర్క్‌ గ్రూప్‌ నుంచి గురువారం విజనరీ లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును ఆయన అందుకున్నారు. విద్యా రంగంలో భాషా అవరోధాలను తొలగించేందుకు ఏఐసీటీఈ తీసుకువచ్చిన అనువాదిని ఏఐ టూల్ రూపకల్పనలో ఆయన కీలకంగా వ్యవహరించి ఈ ఘనత సాధించారు.