అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యం.. జన్నారం ఎఫ్డీవో రామ్మోహన్ స్పష్టీకరణ
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
అడవులు వన్యప్రాణుల సంరక్షణకు అటవీ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని జన్నారం ఎఫ్డీవో రామ్మోహన్ తెలిపారు. అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ప్రకృతిలో అడవులకు ప్రత్యేక స్థానం ఉందని, అడవులు ఉంటేనే పర్యావరణ సమస్యలు తగ్గుతాయని అన్నారు. రక్షణ విధుల్లో పలువురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంటూ వారి త్యాగాలను స్మరించుకున్నారు.