ఫ్లైదుబాయ్ విమానంలో సంచలనం: కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్ఛర్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Dubai
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ జరిపిన కత్తిపోట్ల దాడిలో భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. విమానంలో అత్యవసర పరిస్థితి వస్తే సిబ్బంది, వైద్యుల పాత్రపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తీవ్ర గాయాలపాలైనప్పటికీ ఆయన కాక్పిట్ తలుపు తెరిచి ప్రయాణికుల సహాయంతో నిందితుడిని అడ్డుకున్నారని, దాంతో పెను ప్రమాదం తప్పిందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.