లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసిన రాజగోపాల్ రెడ్డి

రిపోర్టర్: KOLA MAHESH స్థలం: నారాయణపురం

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీను నాయక్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ముగ్గురు లబ్ధిదారులకు మొత్తం 56 వేల రూపాయల ఆర్థిక సహాయ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు మేకల రమేష్ ముదిరాజ్ తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు.