ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనం: అండర్ వేర్ బ్రాండ్ కు జూడ్ బెల్లింగ్ హామ్ బ్రాండ్ అంబాసిడర్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Madrid
ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు జూడ్ బెల్లింగ్ హామ్ కొత్త ఫ్యాషన్ క్యాంపెయిన్ తో అందరి దృష్టిని ఆకర్షించారని ఫ్యాషన్ వర్గాలు వెల్లడించాయి. అమెరికన్ బ్రాండ్ కాల్విన్ క్లైన్ గ్లోబల్ అండర్ వేర్ ప్రచారకర్తగా ఆయన అధికారికంగా అడుగుపెట్టారు. మ్యాడ్రిడ్ లో ప్రముఖ ఫోటోగ్రాఫర్ ఆధ్వర్యంలో ఈ కొత్త చిత్రాల షూటింగ్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆటతో పాటు ఫ్యాషన్ రంగంలోనూ తనదైన శైలిని ప్రదర్శిస్తూ బెల్లింగ్ హామ్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారని వారు స్పష్టం చేశారు.