వేడి వేడి టీ లేదా కాఫీ తాగుతున్నారా: అయితే ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి

రిపోర్టర్: వెంకట్ స్థలం: చెన్నై

అధిక వేడి ఉండే టీ లేదా కాఫీని తరచుగా తాగడం వల్ల ప్రాణాంతక క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని గ్లెనీగల్స్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అరుణ్ రమణన్ హెచ్చరించారు. అరవై ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న పానీయాలు తీసుకోవడం వల్ల అన్నవాహిక లోపలి సున్నితమైన పొర దెబ్బతింటుందని తెలిపారు. ఈ వేడి కారణంగా కణాలు తీవ్రంగా నష్టపోయి క్రమేణా క్యాన్సర్ కు దారితీసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.