భూసార పరిరక్షణ కోసం ప్రత్యామ్నాయ ఎరువుల బాట
రిపోర్టర్: venkat
స్థలం: కుక్కునూరు
కుక్కునూరు రైతు సేవ కేంద్రంలో శనివారం ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగంపై రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఏలూరు జిల్లా ఇఫ్కో అధికారి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో మరియు కేంద్రం ప్రొప్రైటర్ వేల్పుల వెంకన్న బాబు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. నానో ఎరువులు, జీవ ఎరువులు, సాగరిక, బోరాన్ తదితర ఎరువుల వినియోగ విధానంపై రైతులకు శిక్షణ ఇచ్చారు. భూసార పరిరక్షణతో పాటు పంటల ఉత్పాదకతను మెరుగుపరచడానికి ప్రత్యామ్నాయ ఎరువులను తగిన మోతాదులో వాడాలని ఈ సందర్భంగా రైతులకు అధికారులు స్పష్టమైన సూచనలు అందజేశారు.