మహిళల క్రికెట్ జట్టు నూతన కెప్టెన్‌గా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన
రిపోర్టర్: సతీష్
స్థలం: న్యూఢిల్లీ
భారత మహిళల క్రికెట్ జట్టు నూతన పూర్తిస్థాయి కెప్టెన్‌గా సీనియర్ ఓపెనర్ స్మృతి మంధానను బీసీసీఐ నియమించినట్లు బోర్డు అధికారులు తెలిపారు. హర్మన్‌ప్రీత్ కౌర్ స్థానంలో జింబాబ్వే సిరీస్ నుంచి ఆమె మూడు ఫార్మాట్లలో బాధ్యతలు చేపట్టనుందని పేర్కొన్నారు. ఆర్సీబీని రెండుసార్లు ఛాంపియన్‌గా నిలపడంతో ఆమెకు ఈ అవకాశం దక్కిందని, తనకు ఈ బాధ్యత దక్కడం గొప్ప గౌరవమని మంధాన హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు.