హైదరాబాద్ నగరంలో నైరుతి రుతుపవనాల తీవ్ర లోటు

రిపోర్టర్: విజయ్ స్థలం: Hyderabad

హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తీవ్ర నిరాశను మిగిల్చాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎల్ నినో ప్రభావం కారణంగా ఆశించిన స్థాయిలో మేఘాలు వర్షాన్ని కురిపించలేదని తెలిపారు. జూన్ తొలి వారంలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు నామమాత్రపు ప్రభావం చూపించడంతో నగరవాసులకు ఎండల తీవ్రత నుండి ఎలాంటి ఉపశమనం లభించలేదని, భూగర్భ జలమట్టాలు పడిపోయి తాగునీటి సరఫరాపై తీవ్ర భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.