ఆసియా క్రీడల్లో కాంస్యం కోల్పోయిన భారత టెక్‌బాల్ క్రీడాకారిణి క్విన్సీ డిసౌజా
రిపోర్టర్: సురేష్
స్థలం: భారత్
ఆసియా క్రీడల మహిళల సింగిల్స్ టెక్‌బాల్ కాంస్య పతక పోరులో ముంబైకి చెందిన భారత క్రీడాకారిణి క్విన్సీ డిసౌజా అద్భుత పోరాటం కనబరిచింది. జపాన్‌కు చెందిన ప్రపంచ 7వ శ్రేణి క్రీడాకారిణి యుయినా సకామోటోతో శనివారం జరిగిన మ్యాచ్‌లో డిసౌజా 0-2 తేడాతో పరాజయం పాలైంది. రెండు సెట్లలోనూ హోరాహోరీగా తలపడినప్పటికీ 11-12, 11-12 తేడాతో పతతాన్ని తృటిలో కోల్పోయింది.