కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తీరుపై కాంగ్రెస్ నిప్పులు
రిపోర్టర్: హరి
స్థలం: న్యూఢిల్లీ
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటరు నమోదులో ఈసీఐ మార్పుల వల్ల తొలిసారి ఓటు వేస్తున్న యువతకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని ఉల్లంఘించి ఫారం 6ను ఏకపక్షంగా మార్చారని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా స్పందించి జవాబుదారీగా చేయాలని డిమాండ్ చేశారు.