రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి: సిద్దిపేటలో హరీష్ రావు డిమాండ్
రిపోర్టర్: రమేష్
స్థలం: సిద్దిపేట
సిద్దిపేటలో నిరుద్యోగ యువత నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యార్థులపై కేసులు పెడితే సహించేది లేదని, తనను దాటి రావాలని హెచ్చరించారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వంపై పోరాడుతామని స్పష్టం చేశారు.