సీఎంఆర్ బకాయిలు చెల్లించని మిల్లర్లపై కఠిన చర్యలు: కలెక్టర్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2025-26 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ బియ్యం డెలివరీని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మిల్లర్లను ఆయన ఆదేశించారు. జాప్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
బకాయిలు చెల్లించని డిఫాల్ట్ మిల్లర్ల ఆస్తులను రెవెన్యూ రికవరీ చట్టం కింద జప్తు చేస్తామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. బకాయిలు చెల్లించిన వారికే తదుపరి సీజన్లో ధాన్యం కేటాయింపులు ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు.