ధాన్యం నిల్వకు పక్కా ప్రణాళికలు: అధికారులకు కలెక్టర్ ఆదేశం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పెద్దపల్లి

జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లను దృష్టిలో ఉంచుకొని, సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వకు అవసరమైన గోదాములను సిద్ధం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. నిల్వ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

ప్రభుత్వ గోదాములను అనుమతి లేకుండా ఎవరికీ కేటాయించవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల తర్వాత నిల్వలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.