హవాయిని వణికించిన లోవెల్ తుఫాను, ఒకరు మృతి
రిపోర్టర్: రాజేష్
స్థలం: World
హవాయిని లోవెల్ తుఫాను తీవ్రంగా తాకడంతో ఒకరు మృతి చెందారు. ఉధృతమైన ఈదురుగాలుల కారణంగా కౌవాయ్ కౌంటీలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. వందల మిలియన్ల డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. విమాన సర్వీసులు రద్దయ్యాయి. సహాయక చర్యల కోసం నేషనల్ గార్డ్ సిబ్బందిని రంగంలోకి దించారు.