కావలిలో దారుణం: ఎస్సై అత్తను హతమార్చి ముప్పై సవర్ల బంగారం దోపిడీ

రిపోర్టర్: రమేష్ స్థలం: Nellore

కావలి పట్టణంలో ఒంటరిగా ఉంటున్న ఎస్సై అత్త పొంగులూరి విజయలక్ష్మిని దుండగులు దారుణంగా హతమార్చి భారీగా బంగారం దోచుకెళ్లారని పోలీసులు తెలిపారు. తుపాన్ నగర్ బైరాగులవీధిలో నివసిస్తున్న ఆమెను రాత్రి సమయంలో గొంతు నులిమి హత్య చేసి, ముప్పై సవర్ల బంగారు నగలను అపహరించుకెళ్లారని పేర్కొన్నారు. ఈ సంచలన ఘటనపై కావలి రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.