గోపరాజుపల్లి అంగన్వాడి కేంద్రంలో ఘనంగా పోషణ మాసం వేడుకలు
రిపోర్టర్: KOLA MAHESH
స్థలం: నారాయణపురం
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని గోపరాజుపల్లి గ్రామంలో పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పోషణ మాసంపై ప్రతిజ్ఞ చేశారు.