మగపిల్లాడు పుట్టలేదన్న కక్ష: కరీంనగర్ లో కట్టుకున్న భార్యను గొంతు నులిమి చంపిన భర్త
రిపోర్టర్: రాము
స్థలం: Karimnagar
మగ సంతానం కాలేదన్న అక్రోశంతో కట్టుకున్న భార్యను కడతేర్చిన అఘాయిత్యం కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. దావు చంద్రకుమార్ అనే వ్యక్తి తన భార్య స్వరూపను మగపిల్లాడు పుట్టలేదనే కక్షతో గత కొంతకాలంగా శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించాడు. కుమార్తెను తీసుకెళ్లకపోతే చంపేస్తానని అత్తమామలకు ఫోన్ చేసి బెదిరించిన కొన్ని గంటల్లోనే, ఆమెను అత్యంత కిరాతకంగా గొంతు నులిమి హత్య చేసినట్లు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ. నిరంజన్ రెడ్డి తెలిపారు.