బెంగళూరులో కూర్చొని కుట్రలు: వైకాపా అధినేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ధ్వజం
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
వైకాపా అధినేత జగన్ బెంగళూరులో కూర్చొని కుట్రలు పన్నుతున్నారని, ప్యాలెస్లు, ఆస్తులు కూడబెట్టే పనిలో బిజీగా ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. బుధవారం 45 వేల మంది కూటమి నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మూడు పార్టీల నాయకులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.