కర్ణాటకలో బయటపడ్డ పురాతన బంగారు నాణేల నిధి

రిపోర్టర్: సునీల్ స్థలం: కర్ణాటక

కర్ణాటకలోని బెళగావి జిల్లా ఇంచల్ గ్రామంలో పనుల్లో ఉండగా కూలీలకు 14 పురాతన బంగారు నాణేలు లభించాయి. సుమారు 800-1000 ఏళ్ల నాటివిగా భావిస్తున్న ఈ నాణేల విలువ రూ.8.20 లక్షలుగా అంచనా. నిజాయితీగా వ్యవహరించిన కూలీలు, ఆ నిధిని అధికారులకు అప్పగించారు. వీటిపై ఏనుగు బొమ్మ ఉండటంతో, చారిత్రక ప్రాధాన్యతపై పురావస్తు శాఖ నిపుణులు పరిశీలన జరుపుతున్నారు.