మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం
రిపోర్టర్: హరి
స్థలం: తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు చారిత్రాత్మక అవకాశం కల్పించింది. స్థానిక సంస్థల పాలనలో అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే లక్ష్యంతో తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లను కో-ఆప్షన్ సభ్యులుగా నియమించనున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శాసనసభ వేదికగా ప్రకటించారు.