బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డికి ఊరట
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డికి నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. స్పీకర్‌ను దూషించారన్న కేసులో వీరి రిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. రూ. 10వేల పూచీకత్తుతో రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు వీరిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.