భారీ వర్షాలకు గిరిజన ప్రాంతాల్లో పూర్తిగా కొట్టుకుపోయిన రహదారులు
రిపోర్టర్: హరి
స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా
అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలకు గిరిజన ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా కొట్టుకుపోయినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. అడవితల్లి బాట పేరుతో ప్రభుత్వం మారుమూల గ్రామాలకు రోడ్లు నిర్మిస్తున్నప్పటికీ, వాయుగుండం కారణంగా నిర్మాణంలో ఉన్న రోడ్లు దెబ్బతిన్నాయి. గూడెంకొత్తవీధి నుంచి చెరకుంపాకలు వెళ్లే మార్గంతో పాటు సప్పర్ల, ఆకులూరు మధ్య కల్వర్టులు ధ్వంసమయ్యాయి. దీంతో తమకు మళ్లీ డోలీ మోతల కష్టాలు తప్పవని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.