విష జ్వరంతో ఖమ్మం రూరల్ మండలంలో యువకుడు మృతి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం రూరల్
విష జ్వరంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం ఖమ్మం రూరల్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తీర్థాలకు చెందిన షేక్ ఆస్మాన్ కు ఒక రోజు జ్వరం వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 6 రోజుల పాటు చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచాడు. యువకుడి మృతితో వారి కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.