తిరుమలలో సెప్టెంబర్ 13న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
రిపోర్టర్: అశోక్
స్థలం: తిరుపతి
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరగడంతో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ సెప్టెంబర్ 13న వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. అలాగే సెప్టెంబర్ 12న ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేశారు. క్యూలైన్లలో వేచి ఉండే సామాన్య భక్తులకు త్వరగా స్వామివారి దర్శనం కల్పించేందుకే ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.