అంబేద్కర్ ఆశయాలను విస్మరిస్తూ కించపరుస్తున్న హమారా ప్రసాద్ దుర్మార్గపు వైఖరి

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో తీవ్ర నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గౌరవాన్ని కించపరిచే విధంగా అసత్యాలతో పుస్తకం రాసిన హమార ప్రసాద్ ను ప్రభుత్వం తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సంఘం అధ్యక్షులు సిటీమల భరత్ కుమార్ డిమాండ్ చేశారు. దళితులను, బహుజనులను అవమానించేలా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు.