పరిషత్ ఎన్నికలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్: పోలింగ్ లో సంయమనం పాటించాలని ఆదేశం
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
పరిషత్ ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేలా కూటమి నేతలు, కార్యకర్తలు సహకరించాలని సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు. పోలింగ్ శాతం తగ్గకుండా వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్ కు వినియోగించుకునేలా చూడాలని సూచించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, అక్రమాలకు పాల్పడితే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని హెచ్చరించారు. రాష్ట్రంలో నేడు 28 జిల్లా పరిషత్తులు, 659 మండల పరిషత్తులకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.