గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం

రిపోర్టర్: అశోక్ స్థలం: నిర్మల్

నిర్మల్ జిల్లాలో రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న అన్ని రకాల అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా స్పష్టం చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు మరియు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని ఆయన హెచ్చరించారు.