నెమిల గ్రామ ప్రజల కొరకు వైద్య శిబిరం

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నెమిల గ్రామములో శుక్రవారం టీబీ, బీపీ, షుగర్ వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో ఎక్స్-రే, తెమడ, రక్త పరీక్షలు విస్తృతంగా చేపట్టారు. ఈ వైద్య సేవలను గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ పులి రాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మార్క శివ, వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.