రైలు ప్రయాణికులకు తీపి కబురు: పది నిమిషాల్లోనే డైపర్లు సమకూర్చిన రైల్వే సిబ్బంది
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
రైలు ప్రయాణంలో ఆరు నెలల చిన్నారికి డైపర్లు అయిపోవడంతో దేవిప్రసాద్ అనే ప్రయాణికుడు రైల్మడద్ యాప్ ద్వారా ఉదయం పది గంటల ఏడు నిమిషాలకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. కేవలం పది నిమిషాల్లోనే స్పందించిన సిబ్బంది తదుపరి స్టేషన్లో డైపర్లు అందించారని, ఈ సేవలు ఎంతో సంతృప్తినిచ్చాయని ప్రయాణికుడు ఎక్స్ వేదికగా వెల్లడించారని పేర్కొన్నారు.